
తిరుపతిలో విజయనగరం కళాకారుల ఖ్యాతి
విజయనగరం టౌన్: అభినయ ఆర్ట్స్ అసోసియేషన్ తిరుపతిలో నిర్వహించిన 25వ వార్షిక జాతీయ పద్యనాటకంలో విజయనగరం జిల్లాకు చెందిన శ్రీ శ్యామలాంబ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సత్యానందం నిర్వహణలో ఈపు విజయకుమార్ దర్శకత్వంలో 25 మంది నటీనటులు ఆదికవి నన్నయభట్టు పద్యనాట కాన్ని మహతి ఆడిటోరియంలో ప్రదర్శించి ఆహూతుల మన్ననలు పొందారు. నన్నయ్యగా కె.సూర్యనారాయణ, నారాయణ భట్టుగా సుబ్రహ్మణ్యం, సోమిదమ్మగా పద్మ, రాజరాజనరేంద్రుడిగా సత్యం మాస్టారు, డిండిమభట్టుగా నల్ల శివరాంనాయు డు, దుర్యోధనుడిగా తిరుపతినాయుడు, శకునిగా లింగరాజు, విదురుడుగా రమణారావు, దృతరాష్ట్రుడిగా కృష్ణ గణేష్, సేనాధిపతిగా ఆర్.సూర్యపాత్రో, సామంత రాజుగా ఎల్. వెంకటేశ్వర్లు, వార్తాహరుడిగా పైడినాయుడు, వేద వ్యాసుడిగా వీవీఎస్.ఎస్. గుప్త, భటుడిగా కోండ్రు కృష్ణారావు, సంగీతం త్రినాథ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టీమ్‌ను దుశ్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లాకు చెందిన కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.