
పోగొట్టుకున్న బ్యాగ్ లభ్యం
విజయనగరం క్రైమ్: పార్వతీపురం మన్యం జిల్లా నుంచి విజయనగరం వచ్చిన ఓ మహిళ తన బ్యాగ్ పోయిందని వన్‌టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనతికాలంలోనే ట్రేస్ చేసి ఆ బ్యాగ్ ను బాధితురాలికి పోలీసులు అప్పగించారు. ఈ ఘటనపై వన్ టౌన్ సీఐ చౌదరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం రావుపల్లికి చెందిన పల్లెం లక్ష్మి తన కుమార్తెను చూసేందుకు బుధవారం విజయనగరం వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆటో ఎక్కి, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ వద్ద దిగిపోయింది. తరువాత ఆటోలో బ్యాగు మర్చిపోయినట్లు గుర్తించి, వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ ఆర్వీఆర్కే చౌదరి ఆదేశాలతో టౌన్ క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు, సిబ్బంది ఆటోను ట్రేస్ చేసి ఆటోలో లభించిన బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ బ్యాగులో ఉన్న రెండున్నర తులాల నల్ల పూసల తాడు, రూ.1300 నగదుతో బాధితురాలు లక్ష్మికి సీఐ అప్పగించారు.
బాధితురాలికి అందజేసిన పోలీసులు