
జగనన్న ప్రభుత్వం హక్కులు కల్పించింది
ఏళ్ల తరబడి భూ హక్కుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోయింది. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భూముల రీ సర్వేలో మాకు శాశ్వత హక్కులు కల్పించింది. ఏళ్లతరబడి సాగుచేస్తున్న భూములను ఏవో కొత్తకొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి కాజేసేందుకు కూటమి పెద్దలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మా గ్రామంలో సగం భూములను కారుచౌకగా పతంజిలి సంస్థకు కట్టబెట్టారు. మరో మారు మా భూములు ఇచ్ఛే ప్రసక్తేలేదు. – కిలపర్తి పరిదేశినాయుడు,
ఎంపీటీసీ, పెదరావుపల్లి గ్రామం
బలవంతంగా లాక్కుంటారా?
దశాబ్దాలుగా సాగుచేస్తున్న మా భూములకు గత ప్రభుత్వం హక్కులు కల్పించింది. ఇప్పడు కూటమి ప్రభుత్వం లాక్కునేందుకు చూస్తోంది. ఇప్పటికే మేము చాలా నష్టపోయాం. ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.
– కిలపర్తి రామకృష్ణ, రైతు, పెదరావుపల్లి గ్రామం

జగనన్న ప్రభుత్వం హక్కులు కల్పించింది