
ఏం తిని బతకాలి
ఇప్పటికే సగానికి పైగా పరిశ్రమల పేరిటి మా భూములను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసేసుకుంది. ఆ భూముల్లో పరిశ్రమలు కట్టారా అంటే అదీలేదు. మరో మారు ఉన్న భూములు కూడా తీసేసుకుంటామంటే ఏం తినిబతకాలి. పచ్చపార్టీవారికి మా భూములే కనిపిస్తున్నాయా?.
– పోలిపర్తి అప్పారావు, రైతు,
పెదరావుపల్లి గ్రామం
వీఎంఆర్‌డీకి నివేదికలు పంపాం
ప్రస్తుతానికి చింతలపాలెం గ్రామం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 103లో సుమారు 50 ఎకరాలకు సంబంధించిన నివేదికలను వీఎంఆర్‌డీకి పంపించాం. ఆ భూమి పూర్తిగా కొండపోరంబోకు. రైతుల అనుభవంలో లేనట్టు గుర్తించాం. మిగిలిన గ్రామాల్లోని భూముల వివరాలను సేకరిస్తున్నాం. వాటి వివరాలను త్వరలోనే నివేదిస్తాం.
– పి.అప్పలరాజు, తహసీల్దార్, కొత్తవలస

ఏం తిని బతకాలి