
నిబంధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోండి
విజయనగరం గంటస్తంభం: జిల్లాలో నిబంధనలు పాటించని కళాశాలలు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ఎన్.నాగభూషణం డిమాండ్ చేశారు. ఇదే విషయమై ఆయన తమ సంఘ నాయకులతో కలెక్టరేట్‌కు సోమవారం వెళ్లి, డీఆర్వో శ్రీనివాసమూర్తిని కలిసి వినతిపత్రం అందజేశారు. కొన్ని ప్రైవేటు కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూనే నీట్, ఐఐటీ అని కోచింగ్‌ల పేరిట పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని తెలిపారు. సెలవు రోజుల్లోనూ తరగతులు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారన్నారు. చర్యలు తీసుకుంటామని డీఆర్వో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ మహిళా ప్రతినిధులు భాను, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో డీఆర్వో శ్రీనివాసమూర్తికి ఏఐఎస్‌ఎఫ్ వినతి