
గిరిజనుల విద్యపై నిర్లక్ష్యం తగదు
విజయనగరం అర్బన్: గిరిజనులకు మెరుగైన విద్య నందించేందుకు అందరూ కృషిచేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీశంకరరావు సోమవారం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొన్ని గిరిజన పాఠశాలలకు ఉపాధ్యాయులు గైర్హాజరు కావడం పట్ల రాష్ట్ర ఎస్టీ కమిషన చైర్మన్ డాక్టర్ డివీజీశంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల తీరుపై పత్రికలలో వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. వివిధ కారణాల వల్ల ఇప్పటికే ఆదివాసీలు విద్యకు దూరమవుతున్నారని, పక్కా భవనాలు, ఉపాధ్యాయులు ఉన్న చోట, ఉపాధ్యాయుల నిర్లక్ష్య వైఖరి వల్ల చిన్నారులు విద్యకు దూరం కావడం శోచనీయమన్నారు. మన్యం జిల్లాలో ఇటువంటి పాఠశాలలు ఇంకా ఎన్ని ఉన్నాయి? ఎందుకు సంబంధిత అధికారులు పాఠశాలలను పర్యవేక్షణ చేయడం లేదనే అంశాలపై జిల్లా యంత్రాంగం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. భవిష్యత్‌లో ఇటువంటి పరిణామాలు పునరావృతం కాకుండా చూడాలని, గిరిజనుల చదువుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్
శంకరరావు