
రాజధర్మం ఇదేనా..?
విజయనగరం ఫోర్ట్:
రైతులు పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవసరమైన రైతుబజార్ కోసం 26 ఏళ్ల కిందట ఇచ్చిన స్థలాన్ని తిరిగి ఖాళీ చేయమనడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాజధర్మం ఇదేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన భూమిని వెనుకకు తీసుకోవడం రాజరికం అనిపించుకోదని వ్యాఖ్యానిస్తున్నారు. ఎం.ఆర్ రైతు బజార్ స్థలం ఖాళీ చేయించాలంటూ కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు కలెక్టర్‌పై ఒత్తిడి తేవడాన్ని తప్పుబడుతున్నారు. 1999లో ఎన్‌సీఎస్ రోడ్డులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎం.ఆర్ (మహారాజ) పేరుమీద రైతు బజార్‌ను ఏర్పాటు చేశారు. అప్పట్లో రైతులకు మేలు చేసేందుకే రైతు బజార్ ఏర్పాటుచేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. ఇప్పుడు అదే స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.
ఆదేశాలు వచ్చాయి..
రైతు బజార్‌ను ఖాళీ చేయించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ మేరకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు నాలుగు స్థలాలు చెప్పాం. వాటిలో ఎదో ఒకటి ఎంచుకోమని సూచించాం.
– బి.రవికిరణ్, మార్కెటింగ్‌శాఖ ఏడీ
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
పిలిచి షాపు పెట్టుకోమన్నారు..
బయట కూరగాయాలు విక్రయించుకుంటే పిలిచి రైతు బజార్‌లో షాపు ఇస్తాం అమ్ముకోండని చెప్పారు. ప్రతినెల షాపుకు రూ.1900 చొప్పున అద్దె చెల్లిస్తున్నాం. ఇప్పుడు రింగ్ రోడ్డు రైతు బజార్‌కు వెళ్లిపోండని చెబుతున్నారు. ఎంతవరకు కరెక్ట్. 45 కుటుంబాల వారం రోడ్డున పడతాం.
– పి.సునీత, రైతు, గాజులరేగ
నోటిలో కూడు లాక్కున్నట్టే...
26 ఏళ్లుగా ఇక్కడే కూరగాయాలు విక్రయించుకుని బతుకు ఈడ్చుతున్నాం. ఇప్పుడేమో వెళ్లిపోండని చెబుతున్నారు. ప్రత్యామ్నాయ స్థలం చూపించి అక్కడ షెడ్‌లు నిర్మించిన తర్వాతే ఇక్కడ నుంచి వెళతాం. నోటిలో కూడా లాక్కోవడం రాజులకు తగదు. – పి.విజయలక్ష్మి, రైతు,
అంబలి వలస, బొండపల్లి మండలం
స్థలం ఇచ్చినట్టే ఇచ్చి వెనుకకు
తీసుకోవడంపై విమర్శల వెల్లువ
ఎం.ఆర్. రైతు బజార్ స్థలం ఖాళీ
చేయించాలని కలెక్టర్‌ను కోరిన అశోక్
నోటికాడ కూడు లాక్కోవద్దంటూ
కలెక్టరేట్ వద్ద రైతుల ఆందోళన
విజయనగరం పాత మహారాజా ఆస్పత్రి దగ్గరున్న రైతుబజార్ ఎత్తివేతను నిరసిస్తూ రైతులు, బజార్ నిర్వాహకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. రైతుబజార్ తొలగించి రైతుల బతుకు బుగ్గిపాలు చేయొద్దని..కలెక్టరు ఉత్తర్వులు వెంటనే రద్దు చేయాలని, రైతుబజార్‌ను ఇక్కడే కొనసాగించాలని ఆందోళకారులు నినాదాలు చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు మాట్లాడుతూ 26 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో నడుస్తున్న బజార్‌ను ఎత్తివేస్తే దాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారంతా ఎక్కడకు పోవాలని ప్రశ్నించారు. ఇది మహారాజా వారసుల స్థలం అనడానికి ఆధారాల్లేవని 2018 ఇదే టీడీపీ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం గుర్తు చేశారు. రైతుబజార్‌ను ఇక్కడే ఉంచాలని లేకుంటే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ, నగర కార్యదర్శి వి.లక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షుడు బి.రమణ కేవీపీస్ జిల్లా కార్యదర్శి రాకోటి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం

రాజధర్మం ఇదేనా..?

రాజధర్మం ఇదేనా..?

రాజధర్మం ఇదేనా..?

రాజధర్మం ఇదేనా..?