
● ‘కూటమి’తీరుపై అంగన్‌వాడీల ఆందోళన
ఐసీడీఎస్‌లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అమలును రద్దు చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, సూపర్ వైజర్లు ఆందోళన చేశారు. గజపతినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సుభాషిణి, పి.జ్యోతి మాట్లాడుతూ బాలసంజీవని యాప్‌లో మాత్రమే సరుకులు ఇవ్వాలన్నారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సరుకులు ఇచ్చేటప్పుడు ఫొటోలు తీసి పెట్టాలన్న విధానం ఇబ్బందికరంగా ఉందన్నారు. నెట్‌వర్క్ లేని కారణంగా గంటల తరబడి లబ్ధిదారులు నిరీక్షించాల్సి వస్తోందన్నారు. కొత్తఫోన్లు ఇవ్వాలని, నెట్‌వర్క్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్ చేయడం వల్ల చిన్నారులకు
ఆటపాటలతో కూడిన విద్యను బోధించలేకపోతున్నామన్నారు. అనంతరం ఐసీడీఎస్ పీఓ
ఎం.రాజేశ్వరికి వినతి పత్రాన్ని అందజేశారు. – గజపతినగరం