
● ఎరువు కరువు తీర్చండి...
జిల్లాలో యూరియా, ఎరువులు ఆర్‌ఎస్‌కే, పీఏసీఎస్‌లలో అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో విజయనగరం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేశారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో బయట మార్కెట్‌లో బస్తా రూ.400కు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎరువు కొరత నివారించాలని కోరుతూ జేసీ సేతుమాధవన్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబు, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి టి.పైడినాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సాగి రవి, చలుమూరి వెంకటరావు, చల్ల పెంటయ్య, సూరిదేవుడు, సత్యారావు తదితరులు పాల్గొన్నారు.
– విజయనగరం ఫోర్ట్