ఉపాధ్యాయుడిపై వేటు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిపై వేటు

Jul 22 2025 6:24 AM | Updated on Jul 22 2025 9:15 AM

ఉపాధ్యాయుడిపై వేటు

ఉపాధ్యాయుడిపై వేటు

బొబ్బిలి రూరల్‌: మండలంలోని నారశింహునిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని జిల్లా అధికారులు సస్పెన్షన్‌ చేశారు. పాఠశాలలో విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి కారణాలపై పలువురు ఫిర్యాదులిచ్చిన నేపథ్యంలో ఇటీవల జిల్లా విద్యాశాఖాధికారులు వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం సస్పెన్షన్‌ ఉత్తర్వులు విడుదల చేసినట్టు ఎంఈఓ గొట్టాపు వాసు తెలిపారు.

లక్కీడిప్‌ విజేతలకు

నగదు బహుమతులు

విజయనగరం ఫోర్ట్‌: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నిర్వహించిన లక్కీడిప్‌లో బహుమతులకు ఎంపికై న వారికి చెక్కులు, సర్టిఫికెట్లను కలెక్టర్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సోమవారం అందజేశారు. పీపీఐయూసీడీలు ఎక్కువ మందికి వేసినందుకు చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎ.వి.ఎస్‌.ఉషారాణికి రూ.8వేలు, వేసెక్ట్‌మీ ఆపరేషన్స్‌ ఎక్కువ చేసిన పోలిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి టి.తిరుపతి స్వామికి రూ.7వేలు, ఆర్‌ఎంఎన్‌సీహెచ్‌+ఏ కౌన్సిలర్‌ ఎ.నాగమణికి రూ. 2,500లు, మోటివేటర్‌ ఎంఎల్‌హెచ్‌పీ ఎస్‌.రమ్యకు రూ.2,500, బెస్ట్‌ మోటివేటర్‌ ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) ఏఎస్‌ఎం ఎం.ఎరుకలమ్మకి రూ.2,500, మోటివేటర్‌ ఆశకు రూ.2,500లు, ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన చంద్రకళ, పైడితల్లి, సునీతలకు రూ.5వేలు చొప్పున, పీపీఐయూసీడీ యాక్సెప్టర్‌ ఎ.హేమలతకు రూ.5వేలు, వేసెక్టమీ యాక్సెప్టర్‌ ఆడపా సురేష్‌కి రూ.5వేలు, ఇంజెక్టబుల్‌ యాక్సెప్టర్‌ వానపల్లి రమ్యకు రూ.5వేలు చొప్పున చెక్కులను కలెక్టర్‌తో కలిసి డీఎంహెచ్‌ఓ జీవనరాణి అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి గణాంకాధికారి సంధ్యారాణి, డెమో వి.చిన్నతల్లి, డెమో సెక్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement