అనాలోచిత అధికారులను వదిలించుకోండి | - | Sakshi
Sakshi News home page

అనాలోచిత అధికారులను వదిలించుకోండి

Jul 21 2025 5:01 AM | Updated on Jul 21 2025 5:01 AM

అనాలో

అనాలోచిత అధికారులను వదిలించుకోండి

పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌

అధ్యక్షుడు సూర్యనారాయణ

పార్వతీపురం రూరల్‌: విద్యాశాఖాధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వం మాట పడాల్సి వస్తోందని, ఈ మేరకు మంత్రి వారిని వదిలించుకునే ప్రయత్నం చేయాలని పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు అమరాపు సూర్యనారాయణ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి తవిటినాయుడు, కాగాన విజయ్‌ సంబంధిత విద్యాశాఖామంత్రి లోకేష్‌కు హితవు పలికారు. ఆర్థికశాఖ అనుమతి తీసుకోకుండా ఉపాధ్యాయ పోస్టులను కొన్ని పాఠశాలలకు మంజూరు చేయకుండా బదిలీలు చేయడం వల్లే జీతాల చెల్లింపునకు సమస్య వచ్చిందన్నారు. ఇప్పటికి కూడా విద్యాశాఖాధికారులు ఎప్పటిలోగా పొజిషన్‌ ఐడీలు కేటాయించి జీతాలు చేయగలరో వివరంగా చెప్పలేకపోతున్నారన్నారు. రెండు నెలలు కావస్తున్నా జీతాలు లేక కుటుంబ జీవన పరిస్థితి ఏవిధంగా నెట్టుకురాగలమని పీఆర్‌టీయూ తరఫున ప్రశ్నించారు. అనాలోచిత అధికారుల హడావిడి బదిలీలు చేసిన కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఈ మేరకు మంత్రి లోకేష్‌ అనాలోచిత అధికారుల విధానాలను గుర్తించి దూరం పెట్టాలని ఏరికోరి ఎంచుకున్న శాఖకు మీరు ఎంచుకున్న అధికారుల వల్ల నష్టపోతున్నారన్న విషయాన్ని గ్రహించి ఆ దిశగా ఆలోచన చేయాలని కోరారు.

బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

జియ్యమ్మవలస రూరల్‌: మండలంలోని చినమేరంగి నెయ్యిల వీధికి చెందిన సిద్ధాంతంనాగరాజు, సిద్ధాతం వెంకటేష్‌లు తమ బైక్‌పై ఆదివారం మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో పెదమేరంగి కూడలికి వెళ్తుండగా పెదమేరంగి రామమందిరం మలుపువద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో వారిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకురాగా డ్యూటీ డాక్టర్‌ ప్రభుతేజ చికిత్స అందించారు. నాగరాజు పరిస్థితి సీరియస్‌ కావడంతో 108 ద్వారా పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. చినమేరంగి ఎస్సై పి.అనీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

ఆదివాసీలకు అండగా

ఉంటాం

రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు

విజయనగరం అర్బన్‌: గిరిజన ప్రాంతంలోని ఆదివాసీలకు అండగా ఉంటామని రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్డర్‌ డీవీజీ శంకర రావు అన్నారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన సమస్యలను రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీవీజీ శంకరరావు దృష్టికి సీపీఎం సీనియర్‌ నాయకుడు ఎం.కృష్ణమూర్తి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేసి ఏజెన్సీలోని పలు సమస్యలను వివరించారు. కురుపాం నియోజకవర్గంతోపాటు ఇతర ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కొరవడిన పరిస్థితులున్నాయని చెప్పారు. నాణ్యమైన విద్య, వైద్యం అందని పరిస్థితులున్నాయన్నారు. మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు వైద్యసహాయం పొందేందుకు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోందని రహదారి సౌకర్యం లేనందున ఇబ్బందులు పడుతున్నారని కృష్ణమూర్తి తెలిపారు. దీనిపై కమిషన్‌ చైర్మన్‌ స్పందిస్తూ ఏజెన్సీ ప్రాంతాల సమస్యలను తమ క్షేత్రస్థాయి పర్యటనల్లో గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్‌ శంకరరావు ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కృష్ణమూర్తికి చెప్పారు.

అనాలోచిత అధికారులను వదిలించుకోండి1
1/2

అనాలోచిత అధికారులను వదిలించుకోండి

అనాలోచిత అధికారులను వదిలించుకోండి2
2/2

అనాలోచిత అధికారులను వదిలించుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement