
ఆడలికి తగ్గుతున్న ఆదరణ
సీతంపేట: సీతంపేట ఏజెన్సీలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆడలి వ్యూపాయింట్ పర్యాటక ప్రాంతం పర్యాటకులు లేక వెలవెలబోతోంది. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో ఇక్కడ వ్యూపాయింట్ నిర్మించారు. ఏడాది కిందట పర్యాటక దినోత్సవం రోజున వ్యూ పాయింట్ ఇక్కడ ప్రారంభమైంది. ఒకప్పుడు వందల సంఖ్యలో టూరిస్టులు ప్రతిరోజూ వచ్చి ఇక్కడి అందాలను వీక్షించి వెళ్లేవారు. ఇప్పుడు రోజులో కనీసం 20 మంది కూడా వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆదివారం సెలవు రోజున కూడా రావడానికి ఎవరూ ఆసక్తి చూపించక పోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే రహదారిలో ప్రమాదాలు సంభవించడమేనని పలువురు చెబుతున్నారు. ఆడలి వ్యూపాయింట్ ఏర్పాటైన తరువాత మలుపుల వద్ద జరిగిన ప్రమాదాల్లో నలుగురు చనిపోయారు. అలాగే ఆటోలు, టూవీలర్‌లు, మ్యాక్సీక్యాబ్‌లు వంటివి ఘాట్‌రోడ్డులోని మలుపుల వద్ద తిరగబడిపోయి పదుల సంఖ్యలో పర్యాటకులు గాయాలపాలైన వారు ఉన్నారు. ఇక్కడికి వెళ్తే ప్రమాదాలు జరుగు తున్నాయన్న భావన టూరిస్టుల్లో కలగడంతో వ్యూపాయింట్ వెలవెలబోతున్నట్లు తెలుస్తోంది.
నిర్మాణంలో రక్షణగోడ..
ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో పలు మలుపుల వద్ద రక్షణగోడలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడక్కడ హెచ్చరిక బోర్డులు సైతం పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రక్షణగోడలు పూర్తయితే పర్యాటకుల రద్దీ పెరిగే అవకాశం ఉందని టూరిజం శాఖ భావిస్తోంది. ఒకప్పుడు కనువిందు చేసిన ఆడలి వ్యూపాయింట్ ఇప్పుడు వెలవెలబోతుండడం గమనార్హం.
టూరిస్టులు లేక వ్యూపాయింట్ వెలవెల
ప్రమాదాలే కారణమా?

ఆడలికి తగ్గుతున్న ఆదరణ

ఆడలికి తగ్గుతున్న ఆదరణ

ఆడలికి తగ్గుతున్న ఆదరణ