
వ్యాధులు ప్రబలకుండా చూడాలి
సీతానగరం: గ్రామాల్లో ఆరోగ్య సర్వేలు పక్కాగా చేపట్టి ప్రజలు రోగాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. ఈ మేరకు బూర్జ గ్రామంలో నిర్వహించిన సంచార చికిత్స వైద్య శిబిరాన్ని సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య తనిఖీలు, అందజేస్తున్న చికిత్స వివరాలు ఈ సందర్భంగా రికార్డుల్లో పరిశీలించారు. అనారోగ్య సమస్యలను స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమ్య, సీహెచ్‌ఓ గాయత్రి, 104 సిబ్బంది, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.