
అర్జీదారులు సంతృప్తిచెందేలా పరిష్కారం
● కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్
విజయనగరం అర్బన్: ప్రజావినతుల పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల వినతులను వారు సంతృప్తిచెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, డిప్యూటీ కలెక్టర్‌లు మురళి, ప్రమీలా గాంధీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు అందజేసిన అర్జీలపై సంబంధిత అధికారులకు వెంటనే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీదారుల సమస్యల పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని అర్జీదారు సంతృప్తిచెందేలా సమస్యలను వేగంగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. సోమవారం పీజీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి వచ్చిన వినతుల్లో పీజీఆర్‌ఎస్ పోర్టర్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ స్వీకరించినవి 178 ఉన్నాయి. వాటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి భూ సమస్యల అర్జీలు 86 వరకు ఉన్నాయి. పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డీఏకు 27, మున్సిపాలిటీకి 11, విద్యాశాఖకు 10, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖలకు చెరో 6, వైద్యశాఖకు రెండు వినతులు వచ్చాయి. అదే విధంగా సచివాలయ సిబ్బంది ఆఫ్‌లైన్‌లో స్వీకరించిన ఫిర్యాదుల్లో ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులమైనా మంజూరు కావడం లేదన్న అందిన వినతులు మరో 120 వరకు ఉన్నాయి.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 39 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందల్ బాధితుల నుంచి 39 ఫిర్యాదులు స్వీరించారు. కార్యక్రమంలో వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత సిబ్బందికి వివరించారు. మొత్తం 39 ఫిర్యాదులు రాగా అందులో భూతగాదాలకు సంబంధించి 11, కుటుంబ కలహాలకు సంబంధించి 5, మోసాలకు పాల్పడినట్లు 5, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, డీసీఆర్బీ సీఐ బి.సుధాకర్, ఎస్సై ప్రభావతి, సిబ్బంది పాల్గొన్నారు.

అర్జీదారులు సంతృప్తిచెందేలా పరిష్కారం