
యథేచ్ఛగా పచ్చని జీడి చెట్ల నరికివేత
భామిని: మండలంలోని పచ్చని జీడి తోటలు నేలమట్టం అవుతున్నాయి. రైతులకు ఆదాయ వనరులు కల్పించే జీడిమామిడి తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో కొందరు అక్రమార్కుల చేతిలో ఈ చెట్లు కలప దుంగలుగా మారుతున్నాయి. అనంతగిరి వద్ద జీడి తోటలను గురువారం నరికేసి అక్రమ రవాణా చేశారు. పచ్చని చెట్లు నరికివేతకు గురై వంట చెరకుగా తరలిపోతున్నాయి. వాల్టా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. లారీలు, వ్యాన్లతో జీడి చెట్లను నరికివేసి కలప దుంగలుగా మార్చి ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. మండలంలోని ఎక్కువగా బురుజోల, బిల్లుమడ గ్రామాల్లో జీడి తోటలు నేలమట్టం అవుతున్నాయి.
శివాలయంలో చోరీ
బొబ్బిలి రూరల్: మండలంలోని పెంట గ్రామంలో నగిరేశ్వర శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. భక్తులు కానుకలను సమర్పించే గుడిలోని హుండీని పగులగొట్టి సుమారు పదివేల రూపాయిల వరకు నగదు, ఇతర ఆభరణాలను దొంగలు కొల్లగొట్టినట్టు ఆలయ పూజారి కొండేటి చందు గురువారం గ్రామపెద్దలకు తెలియజేశారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికి ఇది మూడో సారి జరిగిన దొంగతనమని దొంగలను పట్టుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. మరోమారు పునరావృతం కాకుండా పోలీసులు గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు, భక్తులు పోలీసులను కోరారు.
సెల్‌ఫోన్ల దొంగ అరెస్టు
విజయనగరం క్రైమ్ : విజయనగరం రైల్వే పోలీసులు సెల్‌ఫోన్ల దొంగను గురువారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి జీఆర్పీ ఎస్‌ఐ బాలాజీరావు మాట్లాడుతూ ఆర్‌పీఎఫ్ సిబ్బందితో రైల్వే ప్లాట్‌ఫాంలపై తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి పట్టుబడ్డారన్నారు. పట్టుకుని విచారిస్తే ఆ వ్యక్తి వద్ద నాలుగు సెల్‌ఫోన్లు ఉండటంతో తమదైన రీతిలో విచారించారు. దీంతో రైళ్ల కోసం వేచి ఉన్న ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్లను దొంగలించానని ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితుడి నుంచి రూ.లక్ష విలువ గల నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరు పరిచినట్టు ఎస్‌ఐ తెలిపారు.

యథేచ్ఛగా పచ్చని జీడి చెట్ల నరికివేత

యథేచ్ఛగా పచ్చని జీడి చెట్ల నరికివేత