
ఎమ్మెల్సీ పెనుమత్సకు అభినందనల వెల్లువ
నెల్లిమర్ల రూరల్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు(సురేష్‌బాబు) నియమితులు కాగా ఆయనకు పార్టీ శ్రేణుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండలంలోని మొయిద గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎంపీపీ అంబళ్ల సుధారాణి, జెడ్పీటీసీ గదల సన్యాసినాయుడు, నగరపంచాయతీ వైస్ చైర్మన్ సముద్రపు రామారావులు పెనుమత్సను సత్కరించి, అభినందనలు తెలిపారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి కట్టబెట్టిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలని, మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ, ఇతర నాయకుల సమన్వయంతో పార్టీ మరింత బలోపేతానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత మత్స సత్యన్నారాయణ, వైస్ ఎంపీపీ సారిక వైకుంఠం నాయుడు, నాయకులు పెనుమత్స సంతోష్, రేగాన శ్రీనివాసరావు, జమ్ము అప్పలనాయుడు, గేదెల రామచిరంజీవి, తర్లాడ దుర్గారావు, అంబళ్ల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.