
పారా సబ్ జూనియర్స్, జూనియర్స్ అథ్లెట్స్ ఎంపిక
విజయనగరం: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ క్రీడా మైదానంలో పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వి.రామస్వామి జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లాలో 13 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పారా క్రీడాకారులు వందమందికి పైగా ఈ పోటీల్లో పాల్గొనడం శుభపరిణామమన్నారు. ప్రధానంగా రన్నింగ్, షాట్‌పుట్, లాంగ్ జంప్, హై జంప్, డిస్కస్ త్రో, జావెలిన్ త్రో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరచిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నామని, అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఆగస్టులో హర్యానాలో జరగనున్న జాతీయ స్థాయి పారా జూనియర్, సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2025 కోసం ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు తురెళ్ల రాము, మన్యం జిల్లా అధ్యక్షుడు చీమల రాంబాబు, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ శివగంగ, పారా నేషనల్ స్విమ్మర్ రవి తదితరులు పాల్గొన్నారు.