
సారా స్థావరాలపై పోలీసుల దాడులు
వంగర: మండల పరిధి వి.వి.ఆర్.పేట గ్రామ సమీపంలో సారా స్థావరాలపై శనివారం పోలీసులు దాడులు చేశారు. ఎస్‌ఐ షేక్ శంకర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది నాగావళి పరివాహక ప్రాంతంలో గాలించారు. ఓ ప్రదేశంలో 1500 పులిసిన బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. సారా తయారీ చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
రెండు బైక్‌లు ఢీకొని నలుగురికి గాయాలు
మక్కువ: మక్కువ – చినబోగిలి రహదారి మధ్య ములక్కాయవలస గ్రామ సమీపంలో శనివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు గాయాల పాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం వెంకటభైరిపురం గ్రామానికి చెందిన గంటసాగర్ అనే యువకుడు ద్విచక్ర వాహనంపై మక్కువ వస్తుండగా, మక్కువ నుంచి ములక్కాయవలస గ్రామం మీదుగా మక్కువకు చెందిన చోడవరపు జశ్వంత్, కాతా తనూజ్, చెముడు గ్రామానికి చెందిన వి.విష్ణు బైక్‌పై వస్తున్నారు. ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఢీకొనడంతో నలుగురూ గాయాల పాలయ్యారు. వెంటనే స్థానికులు వీరిని మక్కువ పీహెచ్‌సీకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన చికిత్స కోసం పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
భోగాపురం: భోగాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గల జాతీయ రహదారి 16పై శనివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎరుపు రంగు షర్ట్ వేసుకున్న ఈ వ్యక్తి సమాచారం తెలిస్తే 9121109445 నంబరును సంప్రదించాలని ఎస్‌ఐ ఎస్‌ఐ సూర్యకుమారి తెలిపారు.
లోయలో పడిపోయిన ట్రాక్టర్ ఇంజిన్
సాలూరు: మండలంలోని గిరిశిఖర సంపంగిపాడు పంచాయతీ సుల్లారి నుంచి దిగువరూఢి మధ్య మలుపు వద్ద ట్రాక్టర్ అదుపు తప్పి లోయలో పడిపోయింది. పట్టణం నుంచి యూరియా కొనుగోలు చేసుకుని జీపులో కురుకుటి వరకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి ట్రాక్టర్‌లో లోడ్ చేసుకుని వెళ్తుండగా, దిగువరూఢి మలుపు వద్ద ఆపాడు. ఇటీవల వర్షాలు పడుతుండడం మలుపు ప్రమాదకరమని ముందుగానే గుర్తించి, వారు లోడును అక్కడ నిలిపేశాడు. ట్రాక్టర్ ఇంజిన్‌ను ముందుకు వెనక్కి తీసి లోడుతో ట్రాక్టర్ వెళ్లేందుకు అనువుగా చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ ఇంజిన్ అదుపు తప్పడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై గెంతేయడంతో ప్రమాదం తప్పి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. కాగా వాహనం సుమారు 200అడుగుల లోతులో పడిపోయింది.
ఏడుగురికి రూ.70వేల జరిమానా
పార్వతీపురం రూరల్: మద్యం సేవించి వాహనాలను నడిపినందుకుగాను ఏడుగురు వ్యక్తులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రూ. 70వేలు జరిమానాను పార్వతీపురం ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ విధించినట్టు పట్టణ సీఐ కె.మురళీధర్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడితే మూడు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.

సారా స్థావరాలపై పోలీసుల దాడులు

సారా స్థావరాలపై పోలీసుల దాడులు

సారా స్థావరాలపై పోలీసుల దాడులు