
వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలి
పార్వతీపురం రూరల్: ప్లాస్టిక్ రహిత సమాజంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని, అలాగే ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా ప్రత్యేకాధికారి డా.నారాయణ భరత్ గుప్తా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం పార్వతీపురం మండలంలోని పెదబొండపల్లి గ్రామంలో స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్‌తో కలసి పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో ఉన్న చెత్త సేకరణ కేంద్రాన్ని వారు పరిశీలించి వర్మీకంపోస్టు త యారీ విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో రెండు రకాల డస్ట్‌బిన్లను స్థానికులకు పంపిణీ చేశారు. వాటిలో తడి చెత్త, పొడి చెత్తను వే ర్వేరుగా వేయాలని ప్రజలకు అవగాహన కల్పించా రు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర రా ష్ట్రాల్లో నిత్యావసరాలకు గుడ్డ సంచులను వినియోగిస్తున్నారని, అదే విధంగా మన జిల్లాలో కూడా ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలికి పర్యావరణానికి హానికరం లేని వస్తువులను ప్రజలు వినియోగించాలని సూచించారు. ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ, డీపీవో కొండలరావు, డీఆర్‌డీఏ పీడీ సుధారాణి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేకాధికారి నారాయణభరత్ గుప్తా