
జిందాల్ నిర్వాసితుల ఫిర్యాదులపై విచారణ
విజయనగరం అర్బన్: జిందాల్ సేకరణలో నిర్వాసితులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా చూ స్తామని కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ చాంబర్‌లో చీడిపాలెం, ముషిడిపల్లి, చినఖండేపల్లి, కిల్లంపాలెం, మూల బొడ్డవర గ్రామాలకు చెందిన 10 మంది రైతులు తమకు జిందాల్ భూములకు సంబంధించి ఇంతవరకు నష్టపరిహారం అందలేదని శనివరాం ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన దస్తాలు కలెక్టర్‌కు చూపించి వివరించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ కేఆర్‌సీసీ డిప్యూటీ కలెక్టర్ మురళిని విచారణాధికారిగా నియమిస్తూ నిజనిర్ధారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ప్రకారం తగిన చర్యలు తీసకోవడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మురళి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్