
● నాయకులపై కాదు.. మాపై కేసులు పెట్టండి
భూములు కోల్పోయి, ఉద్యోగాలు రాక, ఉపాధి లేక రోడ్డున పడిన రైతుల మొరవినాలని అడిగితే అణచివేయాలని చూడడం తప్పు అనిపించడం లేదా.. అధికారులకు, కూటమి నాయకులకు ఆత్మసాక్షి లేదా అంటూ జిందాల్ నిర్వాసితులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ నాయకులపై కాదు తమపై కేసులు పెట్టాలంటూ నినదించారు. బొడ్డవర వద్ద శుక్రవారం నిరసన తెలిపారు. వీరికి ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ మద్దతు తెలిపారు. నిర్వాసితులపై పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అనుసరిస్తున్న తీరు సరికాదన్నారు. – శృంగవరపుకోట