
చంద్రబాబు కలవని పార్టీ లేదు.. చెప్పని అబద్ధం లేదు
2024 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎదుర్కొనేందుకు చంద్రబాబునాయుడు కలవని పార్టీ లేదు. చెప్పని అబద్ధం లేదు. ఎవరొస్తే వారి కాళ్లు పట్టుకుని సలామ్ కొట్టారు. కూటమిగా పోటీ చేశారు. దగాకోరు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. ఏడాదికి మూడు సిలెండర్లు ఇస్తామని ఒక్క సిలెండర్‌తో సరిపెట్టారు. ఎటు చూసినా కోతలు, వాతలే మిగులుతున్నాయి. సర్పంచ్‌లను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి తల్లికి వందనం నిలిపివేయడం దుర్మార్గం. ఇప్పటికీ రైతన్నఖాతాకు పెట్టుబడి సాయం జమకాలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా స్కిల్ డెవెలప్‌మెంట్‌కు అనుసంధానం చేశామంటున్నారు. ఆడిబిడ్డ నిధి పథకాన్ని పీ–4కు అనుసంధానం చేశామని, ఎవరైనా డబ్బున్న వారు దత్తత తీసుకుంటే ఆ పథకాన్ని అమలు చేస్తామని చెబుతున్నారు. మరోవైపు పథకాలన్నీ అమలు చేశామని చంద్రబాబు ఎలా చెబుతున్నారో ప్రజలకే అర్థంకాని పరిస్థితి. ప్రజల తరఫున పోరాడే ధైర్యం వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల్లో కొదవలేదు. కూటమి మోసకారి పాలనను వివరిద్దాం.
– కురుసాల కన్నబాబు, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో ఆర్డినేటర్