
అమ్మను అక్కున చేర్చుకున్న స్వచ్ఛంద సంస్థలు
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలోని దండమారమ్మ గుడి రోడ్డులో అనాథగా పడి ఉన్న ఓ వృద్ధురాలి దీనస్థితిపై ‘అమ్మ రోడ్డున పడింది’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన వార్త స్వచ్ఛంద సంస్థల సభ్యుల హృదయాలను కదిలించింది. మాతృభూమి సేవా సంఘం, సాధన యువజన సంఘం ప్రతినిధులు ఇప్పలవలస గోపాలరావు, దుర్గాప్రసాద్, ఆగుడు రవిలు నిరాశ్రయురాలైన వృద్ధురాలిని అక్కున చేర్చుకున్నారు. ఆమెకు స్నానం చేయించి కొత్తదుస్తులు ధరింపజేశారు. శరీరంపై గాయాలను శుభ్రం చేసి, మందుపూశారు. శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఓ అమ్మ దీనస్థితిని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, కన్సల్టెంట్ టి.సుధాకర్ అభినందించారు. సమాజంలోని స్వచ్ఛంద సంస్థలు, పత్రికలు కలిసి నిరాశ్రయుల జీవితాల్లో కొత్త ఆశలు నింపగలవని నిరూపించిందన్నారు.

అమ్మను అక్కున చేర్చుకున్న స్వచ్ఛంద సంస్థలు

అమ్మను అక్కున చేర్చుకున్న స్వచ్ఛంద సంస్థలు