
రాష్ట్రంలో ఇద్దరు మోసగాళ్లు
● పథకాలు ఇస్తామంటూ బాండ్లు ఇచ్చి సంతకాలు చేసి మాయచేశారు
● సూపర్ సిక్స్ ఏవని అడిగితే తోలు తీస్తామంటున్నారు
● ఏడాది కాలంలో అప్పుగా తెచ్చిన రూ.1.60 లక్షల కోట్లు ఎక్కడకి వెళ్లాయి?
● చంద్రబాబు, పవన్‌లు గ్రామాల్లోకి వెళ్లి మేనిఫెస్టో చదవగలరా?
● పేదలు, రైతుల పరిస్థితి దయనీయం
● హామీ ఇచ్చి ఏమార్చడం చంద్రబాబుకు అలవాటే..
● కూటమి తీరును దుయ్యబట్టిన
శాసనమండలి విపక్ష నేత ‘బొత్స’
ప్రజలను మోసం చేశారు
చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేకపోయినా పక్కనే ప్రశ్నించే నాయ కుడు ఉన్నాడు.. పథకాలు ఇవ్వకపోతే చంద్రబాబును కడిగేస్తాడని నమ్మి జనం ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ పథకాలు లేవు, ప్రశ్నించే గొంతు కనపడకుండా పోయింది. కూటమి ఇచ్చిన హామీలు, మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతం చేద్దాం. ప్రజల గొంతుకై నిలబడదాం. దీనికోసం పార్టీ అండగా నిలబడుతుంది. రైతన్నకు ఎరువు దొరకడం లేదు. సాగుసాయం ఎప్పుడిస్తారో తెలియదు.. పింఛన్‌దారుల పేరు జాబితాలో ఉన్నా చేతికి డబ్బులు అందడం లేదు. పోలీస్ వ్యవస్థను కీలుబొమ్మగా మార్చేసి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఓ బీసీ మహిళా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కారును చుట్టుముట్టి దాడి చేయడమే దీనికి నిదర్శనం. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టి కారులో కూర్చున్న జెడ్పీ చైర్‌పర్సన్ భర్తపై కేసు నమోదు చేయడం దౌర్భాగ్యం.
– మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీచైర్మన్
చీపురుపల్లి: మాట మీద నిలబడని వారిని, ఇచ్చిన మాట తప్పిన వారిని, చెప్పిన మాటను మార్చిన వారిని మన గ్రామాల్లో ఏమంటారో చెప్పండి.. మోసగాళ్లు, మాయగాళ్లు అంటారా అనరా.. మరి ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి, ఇంటింటికీ వెళ్లి హామీలు అమలు చేస్తామని సంతకాలు చేసిన బాండ్లు కూడా ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాది కావొచ్చినా హామీలు అమలు చేయని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఏమనాలి.. తీరా పథకాలు ఏవని అడిగితే తోలు తీస్తాం, నాలుక మందం అనే మాటలు మాట్లాడుతున్నారు.. ఈ ఇద్దరు మోసగాళ్లకు ధైర్యం ఉంటే గ్రామాల్లోకి వెళ్లి వారు ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టో చదవగలిగితే ఎవరి తోలు ఎవరు తీస్తారో ప్రజలే నిర్ణయిస్తారంటూ శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి తీరుపై ఫైర్‌అయ్యారు. గరివిడిలోని వి–కన్వెన్షన్ ఆవరణలో సోమవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ చీపురుపల్లి నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ ఎన్నికల ముందు సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పిన చంద్రబాబు ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పుల కోసం మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడతారని చెబుతున్నారని, భావితరాల భవిష్యత్‌ను తాకట్టుపెట్టడం దేశ ద్రోహంకాదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన క్యాబినేట్ సమావేశంలో మంత్రులు అవినీతిపై చంద్రబాబు ఫైర్ అయినట్లు కొన్ని పత్రికల్లో చూశానని, ‘యథా రాజా తథా ప్రజా’ అనే సామెత గుర్తుకొచ్చిందన్నారు. దోపిడీలో సాక్షాత్తూ చంద్రబాబే నంబర్‌వన్‌గా ఉన్నప్పుడు మంత్రులు మాత్రం ఏం చేస్తారని ఎద్దేవాచేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పరిపాలన చూస్తుంటే.. చంద్రబాబు అంత అబద్ధాలకోరు రాజకీయ నాయకుడిని దేశంలోనే చూడలేదన్నారు. అబద్ధాల పాలనను ప్రజలకు వివరించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలు అమలుచేయకపోవడం వల్ల ఒక్కో పేద, రైతు కుటుంబాలు ఏ మేరకు నష్టపోయాయో వివరించాలన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు, పవన్‌లతోపాటు స్థానిక టీడీపీ నేతల సంతకాలతో కూడిన బాండ్లును అందజేసి మోసం చేసిన తీరును తెలియజేయాలన్నారు. ఎరువు దొరకక రైతులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేస్తే తప్ప పొగాకు, మిర్చి, మామిడి రైతులు చంద్రబాబుకు గుర్తుకు రాలేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే రైతులకు శాపంలా మారుతోందన్నారు. అందుకే రైతులు ఐరన్‌లెగ్ అంటుంటారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు బొత్స సందీప్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్లు ఎస్.వి.రమణరాజు, కె.వి.సూర్యనారాయణరాజు, గుర్ల, గరివిడి ఎంపీపీలు పొట్నూరు ప్రమీల, మీసాల కృష్ణవేణి, జెడ్పీటీసీలు వలిరెడ్డి శిరీష, వాకాడ శ్రీనివాసరావు, శీర అప్పలనాయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, పార్టీ మండలాధ్యక్షులు మీసాల వరహాలనాయుడు, మీసాల విశ్వేశ్వరరావు, పొట్నూరు సన్యాశినాయుడు, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, నాలుగు మండలాల నాయకులు దన్నాన జనార్దనరావు, కరిమజ్జి శ్రీనివాసరావు, పతివాడ రాజారావు, బమ్మిడి కార్తీక్, లెంక శ్రీరాములు, తాడ్డి వేణు, పిఎస్‌ఆర్‌కె.ప్రసాద్, తోట తిరుపతి రావు, స్వామినాయుడు, తదితరులు పాల్గొన్నారు.
చంద్రబాబు నిజం చెప్పకూడదు
సీఎం చంద్రబాబునాయుడుకు నిజం చెప్పకూడదన్న శాపం ఉంది. అందుకనే ఎప్పడూ ఆయన నిజం చెప్పరు. నిజం చెబితే తల వేయి చెక్కలవుతుందన్న భయం. చంద్రబాబు నైజం మోసమని ప్రజలకు తెలిసినప్పటికీ ఆశతో ప్రజలు ఓట్లు వేశారు. మళ్లీ ఎప్పటిలాగే మోసపోయారు. కూటమి నేతల మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే వైఎస్సార్ సీపీ కార్యకర్తల ప్రధాన కర్తవ్యం. 15వ ఆర్థిక సంఘం నిధులు ఇతర పనులకు మళ్లించడంతో పంచాయతీల్లో కనీసం వీధి లైట్లు కూడా వేయలేని దుస్థితి. సంక్షేమంలేదు. అభివృద్ధి పనులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే నాథుడు కూడా లేడు. అంతా మోసపూరిత పాలనే కనిపిస్తోంది.
– బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ,
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు

రాష్ట్రంలో ఇద్దరు మోసగాళ్లు

రాష్ట్రంలో ఇద్దరు మోసగాళ్లు

రాష్ట్రంలో ఇద్దరు మోసగాళ్లు