
రైతు సమస్యలను ప్రభుత్వమే పరిష్కరించాలి
గజపతినగరం: విత్తు నుంచి పంట దశ వరకు రైతులకు ఎటువంటి సమస్య ఎదురైనా ప్రభుత్వాలే పరిష్కరించాలని సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా చీఫ్ జనరల్ మేనేజర్ ఎ.రాజగోపాల్ అన్నారు. గజపతినగరం దిగువవీధిలోని రైతు సేవా కేంద్రాన్ని సోమవారం పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు సమయంలో గోనె సంచులు ఇవ్వకపోవడం, తూకంలో ఇబ్బందులను ఏకరువు పెట్టారు. గజపతినగరం పీఏసీఎస్‌కు 2018–19 నుంచి ఇంతవరకు వరకు క్వింటాకు రూ.31.25పైసలు చొప్పన ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్ రూ.2,86,52,552ల ఇచ్చేలా చూడాలని సీఈఓ నారాయణరావు కోరారు. కార్యక్రమంలో ఎఫ్‌సీఐ డివిజినల్ మేనేజర్ సునీల్ కుమార్, క్వాలిటీ కంట్రోల్ ఏజీఎం సర్కార్, ప్రొక్యూర్ మెంట్ మేనేజర్ జి.వరుణ్‌దేవి, క్వాలిటీ కంట్రోల్ మేనేజర్ నరేష్‌కుమార్, ఏఓ పి.కిరణ్‌కుమార్, విజయనగరం క్వాలిటీ కంట్రోల్ విభాగం సివిల్ సప్లయ్ అధికారి బి.మహేష్, తదితరులు పాల్గొన్నారు.
సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ రాజగోపాల్