
మద్యం దుకాణంలో చోరీ నిందితుల ఆరెస్టు
కొత్తవలస: మండలంలోని రాజా సినిమాహాల్ సమీపంలో గల 202 కాలనీ వద్ద ఉన్న మద్యం దుకాణంలో గత నెల 28వ తేదీన దొంగలు చొరబ డి తాళాలు విరగ్గొట్టి 240 మద్యం సీసాలను ఎత్తు కు పోయారు. కాగా అప్పట్లో సీఐ సీహెచ్.షణ్ముఖరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్ర మంలో కొత్తవలస ఆర్చి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న 202 కాలనీకి చెందిన ఇద్దరు పాత నేరస్తులను గురువారం అదుపులోకి తీసుకుని విచారణ చేయగా నేరం అంగీకరించినట్లు సీఐ తెలిపారు.ఈ మేరకు పి.యోహాను, పి.దర్శన్‌బాబు, పి.యేసులుగా నిందితులను గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం యేసు పరారీలో ఉన్నాడని మిగిలిన ఇద్దరు నిందితుల దగ్గర కొన్ని మద్యం సీసీలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అనంతరం కొత్తవలస కోర్టులో నిందితులను హాజరు పరచగా రిమాండ్ విధించారన్నారు. కార్యక్రమంలో ఎస్సై మన్మథరావు, ఏఎస్సై యువరాజు, పలువురు కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.