
ప్రజాగ్రహానికి రాజకీయ రంగు!
చికెన్
బ్రాయిలర్ లైవ్ డెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ125 శ్రీ220 శ్రీ230
సాలూరు: సాలూరులో శ్యామలాంబ పండగ అంగరంగ వైభవంగా చేసేందుకు పట్టణ ప్రజలతో పాటు లక్షలాది మంది భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు స్నేహితులు, బంధువులను పిలిచి మూడు రోజుల పాటు పండగ వైభవంగా చేసేందుకు సిద్ధమయ్యారు. అనుకున్నట్టు అంతా జరిగింది..వైఫల్యమంతా విద్యుత్ అంతరాయంలోనే కనిపించింది. మరోవైపు అంజలి రథ చక్రం విరిగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. పట్టణ వాసులతో పాటు వచ్చిన భక్తులకు విద్యుత్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం చుక్కలు చూపించింది. మూడు రోజుల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయంతోనే సరిపోయింది. ఒకనొక సమయంలో స్థానికులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. పండగ పూర్తయిన తరువాత కూడా విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో పాలకులు, అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. దీంతో రోడ్లపైనే ప్రజలు విద్యుత్ సమస్యపై అర్ధరాత్రి వరకు బైఠాయించారు. అయినా అధికార పార్టీ నేతలు, అధికారుల్లో వీసమంతా చలనం లేకపోయింది. తీరా చూస్తే ఇప్పుడు దీనికి కూడా టీడీపీ శ్రేణులు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తోంది. అక్కడితో ఆగకుండా అధికారులపై అధికార పార్టీ నేతలు ఆగ్రహిస్తున్నారు.
ప్రజా సమస్యలకు రాజకీయ రంగు
పట్టణ ప్రజలు నాలుగు రోజుల పాటు కరెంట్ లేక ఇబ్బందులు పడి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడితే దీన్ని ఓ పార్టీకి ఆపాదించే కుట్రలు పన్నుతున్నారు అధికార పార్టీ నేతలు. పండగ నేపథ్యంలో ప్రజలు రూ.కోట్లు ఖర్చు చేసి పండగను చేసుకున్నారు. కానీ విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యలతో ప్రజలు తీవ్ర అగచాట్లు పడ్డారు. సమస్య ఆందోళనకు దారితీసే పరిస్థితులు వచ్చిన ఇటు పాలకులు కనీసం దాన్ని సరిచేసే ప్రయత్నం చేయలేదు సరికదా.. ఇదంతా రాజకీయమంటూ చెప్పడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ట్రాన్స్‌ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు
పండగ కోసం సుమారు కోటి 24 లక్షల రూపాయిలతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అధికారుల మాటలను నమ్మి ఓ అడుగు ముందుకు వేసిన మంత్రి సంధ్యారాణి ఈ విషయమై ఉత్సాహంతో పండగ ఏర్పాట్లు చేసుకోండని పిలుపునిచ్చారు. తీరా చూస్తే విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఎక్కడికక్కడ కాలిపోయాయి. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ సరఫరా అయిన ప్రాంతాల్లో లో, హై ఓల్టేజీలు తరచూ రావడంతో ఇళ్లల్లో గృహోపకరణాలు పాడయ్యాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పండగ నేపథ్యంలో విద్యుద్దీకరణ పనుల్లో కొందరికి ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే పండగ సమయంలో ఇంతగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పండగ సమయంలో మూడు రోజుల పాటు తలెత్తిన విద్యుత్ సమస్య నేటికీ చర్చనీయాంశంగానే ఉంది.
పండగ ఏర్పాట్లలో వైఫల్యం
రాజకీయాలు చేస్తున్న టీడీపీ శ్రేణులు

ప్రజాగ్రహానికి రాజకీయ రంగు!