
హోంగార్డు కుటుంబానికి చేయూత
విజయనగరం క్రైమ్: హోంగార్డుగా పనిచేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన బి.సుందర్ రావుకు చేయూత కింద రూ.3,25,180 చెక్కును ఎస్పీ వకుల్ జిందల్ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమష్టిగా పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది డ్యూటీ అలవెన్స్ కింద పోగు చేసిన సొమ్మును చేయూత కింద ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇది ఒక రకంగా పోలీస్ శాఖలో స్ఫూర్తిని నింపినట్లేనని ఎస్పీ అభిప్రాయ పడ్డారు. చేయూత పథకాన్ని, దాన్ని సిబ్బంది అమలు చేస్తున్న తీరును ప్రశంసించారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ టి.ఆనందబాబు, ఆర్‌ఎస్సై రమేష్ కుమార్, సూపరింటెండెంట్ రామకృష్ట, పీఆర్‌ఓ కోటేశ్వరరావు, ఫొటోగ్రాఫర్ కృష్ట, శ్రీనివాస్, వెంకటేష్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
రూ.3 లక్షల చెక్ అందజేసిన ఎస్పీ