
గంజాయి తరలింపు కేసులో ఆరో నిందితుడి అరెస్ట్
తెర్లాం: గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన కేసులో ఆరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి రూరల్ సీఐ కె.నారాయణరావు, తెర్లాం ఎస్సై సాగర్‌బాబు సోమవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి వారు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. 2024లో రెండు కార్లలో 18.2 కేజీల గంజాయిని రామభద్రపురం నుంచి రాజాం తరలిస్తుండగా తెర్లాం జంక్షన్ వద్ద స్థానిక పోలీసులు పట్టుకున్నారు. అప్పట్లో వారి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి, రెండు కార్లను సీజ్ చేసి నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అదే కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఒడిశా రాష్ట్రంలోని పొట్టంగి మండలం ఘాడిగూడకు చెందిన ఆరో నిందితుడు రామభద్రపురం బైపాస్ వద్ద ఆదివారం రాత్రి సంచరిస్తుండగా తెర్లాం పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ కేసులో ఐదవ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గంజాయి కేసును ఛేదించేందుకు కృషిచేస్తున్న ఎస్సై సాగర్‌బాబు, సిబ్బందిని సీఐ నారాయణరావు అభినందించారు.