
ఏపీ బ్రాహ్మణ సేవాసంఘం ప్రచార క్యాదర్శిగా జీవీ శ్రీనివాస
సీతానగరం: ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సీతానగరం మండలకేంద్రానికి చెందిన గన్నవరపు వెంకట శ్రీనివాస్‌ను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోనూ రు సతీష్‌శర్మ, హెచ్‌కే మనోహర్‌రావు ఉత్తర్వులు జా రీ చేశారు. ఈ మేరకు శుక్రవారం నూతనంగా నియమితులైన రాష్ట్ర ప్రచారకార్యదర్శి గన్నవరపు వెంకట శ్రీనివాస్ మండలకేంద్రంలో మాట్లాడుతూ ఉమ్మడి విజయనగరం జిల్లా బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను రాష్ట్రవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరిస్తానని తెలియజేశారు. ఆయన ఎంపిక పట్ల ఉమ్మడి జిల్లా బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేశారు.