
ప్లేట్ కాంపోనెంట్ ప్రారంభం
విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని రెడ్‌క్రాస్ సొసైటీలో సీఎస్‌ఆర్ నిధులు రూ.76.01 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్ లెట్స్ యూనిట్‌తో పాటు, ఎస్‌డీపీ యూనిట్‌ను రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ సెర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్‌క్రాస్ విశేషమైన సేవలను అందిస్తోందన్నారు. కాంపోనెంట్ యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాల్లో అవసరమైన వారికి రక్తంతో పాటు రెడ్ బ్లడ్ సెల్స్, ఫ్రెష్ ఫ్రోజెన్ ఫ్లాస్మా, ప్లేట్ లెట్స్, క్రయాప్రెసిపిరేట్, సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్స్‌ను సరఫరా చేస్తుందన్నారు. ఆరోగ్య వంతులంతా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కె.రాణి, జిల్లా సైనిక సంక్షేమ అధికారి మజ్జి కృష్ణారావు, రెడ్‌క్రాస్ చైర్మన్ కేఆర్‌డీ ప్రసాదరావు, కార్యదర్శి సత్యం, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎం.జయచంద్రనాయుడు, తదితరులు పాల్గొన్నారు.