
తీరప్రాంత భద్రతపై సీఐఎస్‌ఎఫ్ అవగాహన ర్యాలీ
భోగాపురం: తీరప్రాంత భద్రత, అక్రమంగా ఆయుధాల రవాణా, తీవ్రవాదుల చొరబాటు, మాదక ద్రవ్యాల నిర్మూలన, తీరంలో వృక్ష, జంతు సంరక్షణపై అవగాహన కలిస్తూ సీఐఎస్‌ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ పోర్స్) సిబ్బంది 50 మంది సైకిల్ ర్యాలీ చేపట్టారు. కోలకతాలోని జక్కలి నుంచి ప్రారంభమైన ర్యాలీ సోమవారం భోగాపురానికి చేరుకుంది. వీరికి స్థానిక పోలీసులతో పాటు ప్రజలు స్వాగతం పలికారు. ఈ నెల 31న తమిళనాడులోని కన్యకుమారిలో ర్యాలీ ముగుస్తుందని విశాఖ పోర్టు ట్రస్టు సీనియర్ కమాండెంట్ సతీష్‌కుమార్ జాబ్ పాయ్ తెలిపారు.