
● విజయవాడకు తరలిరండి ● అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన
పోస్టల్ పథకాలను
సద్వినియోగం చేసుకోవాలి
● జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు
నెల్లిమర్ల: తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే పాలసీలను తపాలా శాఖ ప్రవేశపెట్టిందని, పోస్టల్ పథకాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు సూచించారు. నెల్లిమర్ల పోస్టాఫీసుని అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఆ సేవలను ప్రారంభించారు. పోస్టల్ శాఖలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, ఆర్‌డీ, ఎఫ్‌డీ, సీనియర్ సిటిజన్, సుకన్య తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవా లని పిలుపునిచ్చారు. పోస్టాఫీసులో చిన్నమొత్తాలతో నెలనెల పొదుపు చేసుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి పథకం ఎంతగానో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి ఇన్సూరెన్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పోస్టల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్ జి.ఎర్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీటీఏఎస్‌ఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యు లు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్ (ఐఎఫ్‌సీ) భవనంలో కాన్ఫరెన్స్ హాల్‌లో సంఘం రాష్ట్ర కోశాధికారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, కార్యదర్శిగా పి.శాంతి కిరణ్‌కుమార్, కోశాధికారిగా పి.వీరన్న దొర, సహాధ్యక్షులుగా ఎం.నూకరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వై.కృష్ణశ్రావణ్, ఉపాధ్యక్షులుగా పి.సురేష్‌బా బు, ఎస్.రామకృష్ణ, పి.వరలక్ష్మి, కార్యదర్శులు గా సీహెచ్ రమేష్‌బాబు, ఎం.దుర్గాప్రసాద్, వై.జయశ్రీ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి గా పీవీ నారాయణరావు నూతన కమిటీని ప్రకటించారు.
19న అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్ర
పార్వతీపురం: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న విజయవాడలో తలపెట్టిన అగ్నిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు బాధితులు తరలి రావాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ స్థానిక కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ ఆర్థిక మోసాలకు పాల్పడి పదేళ్ల తొమ్మిది నెలలు గడిచినా... గతంలో తెలుగుదేశం ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసినప్పటికీ చెల్లింపు విషయంలో విఫలమైందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో కొట్లాదిగా అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టడంతో బాధితుల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయన్నారు. కూటమి పాలకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాధితులకు నిరాశే మిగిలిందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మన్యం జిల్లా అధ్యక్షుడు ఆర్‌వీఎస్ కుమార్ తదితరులు ఉన్నారు.

● విజయవాడకు తరలిరండి ● అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన