
విజయనగరం
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025
ఆటోవాలా డీలా..!
ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వాలు తరచూ డీజిల్ ధరలు
పెంచుతూ పోవడంతో తిప్పలు తప్పడం లేదు.
–8లో
ఒక్క రూపాయి కూడా
ఇవ్వక్కర్లేదు..
డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకున్నా, శస్త్రచికిత్స చేసుకున్నా ఒక్క రుపాయి కూడా సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు తీసుకోకూడదు. ఒక వేళ ఏవైనా వైద్య పరీక్షలు చేయించినా వాటికై న బిల్లులు సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు రోగికి చెల్లించాలి. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు రవాణ చార్జీలు కూడా ఇవ్వాలి. రోగికి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించినా, శస్త్రచికిత్స చేసినా సంబంధిత వ్యాధికి ఆరోగ్యశ్రీ ట్రస్టు వారు సంబంధిత ఆస్పత్రికి ప్రోత్సాహకంగా నిధులు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా హెల్ప్ డెస్క్ వద్ద రిజిస్ట్రేషేన్ చేయించుకున్న వారికి ఓపీ కూడా ఉచితంగా చూడాలి. అయితే కొన్ని ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇచ్చిన నిధులు చాలవన్నట్టు రోగుల నుంచి కూడా గుట్టుగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
గంట్యాడ మండలానికి చెందిన పి.గోవింద అనే వ్యక్తి కొద్ది నెలలు క్రితం వెన్నుపూసకు
సంబంధించిన శస్త్రచికిత్స చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించినప్పటికీ అతని నుంచి అదనంగా రూ.20 వేలు తీసుకున్నారు.
మెంటాడ మండలానికి చెందిన
ఎన్.ఈశ్వరరావు కొద్ది నెలలు క్రితం ఆరోగ్యశ్రీ
నెట్‌వర్క్ ఆస్పత్రిలో తుంటి ఎముక శస్త్రచికిత్స
చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించినప్పటికి సదరు ఆస్పత్రి వారు మంచి పరికరాలు వేస్తామని చెప్పి అతను
నుంచి అదనంగా రూ.60 వేలు తీసుకున్నారు.
విజయనగరం ఫోర్ట్:
జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు రోగుల నుంచి అదనపు వసూళ్లుకు పాల్పడుతున్నా యి. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం ద్వారా రోగులకు ఉచితంగా సేవలు పూర్తి స్థాయిలో అందించాలి. చికిత్సతో పాటు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్లీ ఫాలో ఆప్ చూపించుకోవడానికి వచ్చినప్పడు కూడా ఉచితంగా చికిత్స అందించి మందులు ఇవ్వాలి. ఒక్క పైసా కూడా అదనంగా వసూలు చేయడానికి లేదు. కాని కొన్ని నెట్‌వర్క్ ఆస్పత్రుల వైద్యులు ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మీకు మంచి ఇంప్లాట్స్ (పరికరాలు) వేయాలి.. అందు కోసం కొంత డబ్బు లు ఖర్చు అవుతాయి.... అవి వేసుకుంటే మీరు త్వరగా కోలుకుంటారని చెప్పి రోగుల నుంచి అద నపు వసూళ్లుకు పాల్పడుతున్నారు. అది కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఆర్థో(ఎముకలు), న్యూరో విభాగం శస్త్రచికిత్సలు జరిగే ఆస్పత్రుల్లో ఈ తరహా అదనపు వసూళ్లుకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే కొంతమంది వైద్యులు ప్రభు త్వ ఆస్పత్రులు నుంచి రోగులను ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు తరలించి అక్కడ శస్త్రచికిత్సలు చేసి అదనపు వసూళ్లు చేస్తున్నట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారులు నెట్‌వర్క్ ఆస్పత్రులపై పర్యవేక్షణ అంతంతగా మాత్రంగానే చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బయటకు చెప్పుకోలేక..
వైద్యులు రోగుల నుంచి అదనపు వసూళ్లుకు పాల్పడిన విషయం బయటకు చెప్పలేక పోతున్నారు. చెబితే ఎక్కడ చికిత్స అందించడంలో వైద్యులు అలసత్వం వహిస్తారోనని రోగులు భయపడుతున్నా రు. కొన్ని ఆస్పత్రులు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేయగా, మరికొన్ని ఆస్పత్రు లు రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూ లు చేసినట్టు తెలుస్తుంది. కొన్ని ఆస్పత్రులు అయితే రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. జిల్లాలో ఉన్న నెట్‌వర్క్ ఆస్పత్రులతో పాటు విశాఖపట్నంలోని ఆరో గ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో కూడా అదనపు వసూళ్లుకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్
ఆస్పత్రులు
జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు 25 ఉన్నాయి. అభినవ ఆస్పత్రి, అమృత, గాయిత్రి, జీఎంఆర్ వరలక్ష్మి ఆస్పత్రి, కావేరి, కొలపర్తి, మువ్వగోపాల, నెఫ్రో ఫ్లస్ ఆస్పత్రి, పీజీ స్టార్, పుష్పగిరి, క్వీన్స్ ఎన్‌ఆర్‌ఐ, సంజీవిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, బాబాజీ, శ్రీ సాయి సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి శ్రీ సాయికృష్ణ, పీవీఆర్ ఆస్పత్రి, శ్రీనివాస నర్సింగ్ హోమ్, సన్‌రైజ్, స్వామి కంటి ఆస్పత్రి, తిరుమల మెడికవర్, వెంకటరామ, వెంకట పద్మ ఆస్పత్రులు ఉన్నాయి. అదే విధంగా 9 సీహెచ్‌సీలు, 46 పీహెచ్‌సీల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, బొబ్బిలి సీహెచ్‌సీ, గజపతినగరం, ఎస్.కోట, రా జాం ఏరియా ఆస్పత్రులు, భోగాపురం నెల్లిమర్ల, చీపురుపల్లి సీహెచ్‌సీలు, ఘోషాస్పత్రిల్లో ఆరోగ్య శ్రీ పథకం అమల్లో ఉంది.
న్యూస్‌రీల్
మంచి పరికరాలు వేస్తామంటూ రోగులను నమ్మిస్తున్న వైద్యులు
పరికరాలు పేరుతో రూ.వేలల్లో వసూలు చేస్తున్న వైనం
జిల్లా ఆస్పత్రులతో పాటు విశాఖలోని ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి
జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు
గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తంతు
మొత్తం ఉచితమే..
ఆరోగ్యశ్రీ పథకం వర్తించే వారికి ఉచితంగా వైద్యం చేయాలి. అదనంగా ఒక్క పైసా కూడా తీసుకోకూడదు. ఎవరైనా అదనపు వసూళ్లుకు పాల్పడినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కొయ్యాన అప్పారావు,
ఇన్‌చార్జి ఆరోగ్యశ్రీ కో – ఆర్డినేటర్

విజయనగరం

విజయనగరం

విజయనగరం