
మా భూమి మాది కాదంటున్నారు....
మాకు ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిన ఎకరా భూమిని ఎమ్మెల్యే బేబీనాయన బలవంతంగా ఆక్రమించుకున్నారు. మేము అడ్డుపడి అడిగితే ఈ భూమి మీది కాదు మాది అంటున్నారు. సంవత్సరాల తరబడి మేం అనుభవిస్తున్న భూమిని ఇప్పుడు కాదంటే మేము ఎవ్వరికి చెప్పుకోవాలి. భూమి సర్వే నంబర్లు మార్చేయడంలో వీఆర్వో సింహాచలం పాత్ర ఉంది.
– అల్లు సంతోష్‌కుమార్ (సీతమ్మ వారసుడు)
మాకు రైతు భరోసా కూడా వచ్చేది...
మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి సాగు చేసుకుంటున్నాం కాబట్టే రైతుభరోసా పెట్టుబడి సాయం కూడా గత ప్రభుత్వంలో అందేది. ఆధారాలు చూపించమంటే వీఆర్వో సింహాచలానికి ఇదే విషయం చెప్పాం. పట్టా చూపించాం. అయినాసరే మా భూమి ఆక్రమించుకున్నవారికి ఆయన వంత పాడుతున్నారు.
– తెంటు వరలక్ష్మి (చిన్నమ్మి వారసురాలు)
మా భూమిలో బేబీ నాయన లే అవుట్
డీపట్టా భూమిని 1991 నుంచి మా స్వాధీనంలోనే ఉంది. వర్షాలు లేక కొన్నాళ్లు సాగుచేయలేదు. ఈ భూమిపై ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారాలు, అలాగే రైతుభరోసా పెట్టుబడి సాయం వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే బేబీ నాయన అనుచరులు మా భూమిని లాక్కొన్నారు. అడిగితే వేరేచోట భూమి ఇస్తామన్నారు. అదేమీ ఇవ్వకుండానే మా భూమిలో లేఅవుట్ వేస్తున్నారు. – బెవర అప్పలనాయుడు
(సావిత్రమ్మ వారసుడు)

మా భూమి మాది కాదంటున్నారు....

మా భూమి మాది కాదంటున్నారు....