
‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’లో అగ్రశ్రేణిలో నిలవాలి
విజయనగరం: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విజయగనరం అగ్రశ్రేణిలో నిలవాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ.బాబు ఆకాంక్షించారు. శనివారం స్థానిక బీఆర్ అంబేడ్కర్ జంక్షన్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ.బాబు, కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, ఆర్డీఓ డి.కీర్తి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, తదితరులు పాల్గొన్నారు. ముందుగా గంటస్తంభం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ నిర్వహించారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదాలతో మహిళలు ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధిస్తామని మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను, ప్లాస్టిక్ వస్తువులతో రూపొందించిన గృహాలంకరణ వస్తువులను తిలకించారు. కార్యక్రమంలో వయోజనవిద్య డీడీ ఎ.సోమేశ్వరరావు, కార్పొరేషన్ ప్రజారోగ్యాధికారి కొండపల్లి సాంబమూర్తి, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ వల్లి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రత్యేక అధికారి బాబు