
మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లు
సాలూరు: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను కేటాయించింది. వీటిని సీ్త్ర, శిశు సంక్షేమ, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం పట్టణంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఎన్‌పీసీఐ కొవ్వాడ కేంద్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికామత్, అసోసియేట్ డైరెక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
గిరిబజార్‌ను ప్రారంభించిన మంత్రి
అంబులెన్స్‌లతో పాటు గిరిజనులకు నిత్యావసర వస్తువులు అందుబాటులో తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన గిరిబజార్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా నాణ్యమైన సరుకులను అందించడం జరుగుతుందని తెలిపారు.
మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు
మంత్రి సంధ్యారాణికు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
రోగులకు మెరుగైన సేవలను అందించేందుకే..
పార్వతీపురం: రోగులకు మెరుగైన సేవలను అందించేందుకు అదనంగా మూడు అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాకు కేటాయించిన మూడు అంబులెన్స్‌లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు సకాలంలో సేవలు అందించేందుకు వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.

మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లు