
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి
విజయనగరం గంటస్తంభం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ నిధులు, కార్మికుల జీతాలకు నిధులు కేటాయించాలని, సొంత గనులు ఇచ్చి, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేఽశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 4 సంవత్సరాలుగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత గనులు లేక స్లీల్ ప్లాంట్ ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంటే నష్టాలకు కార్మికుల్ని బాధ్యులను చేస్తూ ప్లాంట్ నిర్వీర్వానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు నిలుపుదల చేశారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులతో తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత ప్రకటనలు ప్రజలు అర్థం చేసుకుంటారని, అప్పుడు ఈ ప్రభుత్వాలకు ఋద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస, జిల్లా కార్యదర్మి జగన్మోహన్‌రావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి రాము, వెంకటేష్ తదితరలు పాల్గొన్నారు.
కార్మికులకు జీతాలు విడుదల చేయాలి
సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని
సూర్యనారాయణ