
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ98 శ్రీ166 శ్రీ176
సెలవు రోజూ సర్వే
● ఉద్యోగులను వేధిస్తున్న కూటమి
ప్రభుత్వం
రామభద్రపురం: సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది.కూటమి ప్రభుత్వం రాకతో వారి మీద పని భారం వేసి గొడ్డు చాకిరీ చేయిస్తోంది. పనిదినాల్లోనే కాకుండా సెలవు రోజుల్లో కూడా కనీసం కుటుంబ సభ్యులతో గడపకుండా సర్వే పేరుతో వేధిస్తోంది. శుక్రవారం హోలీ సెలవు రోజున తప్పనిసరిగా పీ–4 సర్వే చేయాలని అధికారులు ఆదేశిచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్వే చేశారు. రామభద్రపురం మండలంలో ప్రస్తుతం సర్వే చేసుకో..జీతం పుచ్చుకో అన్న వ్యవహారం గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో ట్రెండింగ్‌గా మారింది. ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులపై మెడపై కత్తి పెట్టి మరీ సర్వే చేయిస్తోంది.దీంతో సచివాలయాల ఉద్యోగులు నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నామని పేరు బయటకు చెప్పుకోలేని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారితే చాలు ఏ అధికారి నుంచి ఏ ఫోన్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నామని, చివరికి బీపీలు, సుగర్‌లు కూడా వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా సర్వేయర్ల సంఘం ఎన్నిక
● అధ్యక్షుడిగా కాశినాయుడు
విజయనగరం ఫోర్ట్: గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కాశినాయుడు ఎన్నికయ్యారు. స్థానిక ఎన్‌జీఓ హోంలో గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ కో ఆర్డినేటర్‌గా భరత్, జిల్లా కార్యదర్శిగా దుర్గా మదీనా, జిల్లాస్పోర్ట్స్ సెక్రటరీగా జగదీష్ , ఉపాధ్యక్షురాలిగా రమాదేవి, జాయింట్ సెక్రటరీగా లక్ష్మీప్రసాద్, జిల్లా ట్రెజరర్‌గా అజయ్‌కుమార్, జిల్లా ఉమెన్ వింగ్ కార్యదర్శిగా యోర్నా సాయి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు అభినందనలు తెలియజేశారు.
ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శన
వేపాడ: మండలంలోని సోంపురం గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి తీర్థమహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. ఈ గుర్రాల పరుగు ప్రదర్శనలో విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 10 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పరుగు ప్రదర్శనలో లక్కవరపుకోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ మురుగన్ గుర్రం ప్రథమ స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెస్సీ గుర్రం, మూడోస్థానంలో అంకుపాలానికి చెందిన విజయదుర్గా గుర్రం, నాల్గోస్థానంలో కోటనందూరుకు చెందిన శివరాజు బ్రదర్స్ గుర్రం నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులను గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందజేశారు.
గడ్డి కుప్పలు దగ్ధం
పాలకొండ రూరల్: మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఆలుబిల్లి చంద్రశేఖర్ గడ్డికుప్పలు శుక్రవారం దగ్ధమయ్యాయి. పశువుల దాణా నిమిత్తం పొలంలో కుప్పలు వేసిన గడ్డికుప్పల నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ ఆక్కడి పరిసరాలను చుట్టముట్టడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తక్షణమే ఫైర్ అధికారులకు సమాచారం అందించగా ఎస్సై జామి సర్వేశ్వరరావు, సిబ్బంది, శకటంతో సహా ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. వేసవి నేపథ్యంలో ఈ తరహా ప్రమదాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ ఎస్సై ప్రజలకు అవగాహన కల్పించారు.

చికెన్

చికెన్

చికెన్

చికెన్