సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి

Mar 14 2025 12:59 AM | Updated on Mar 14 2025 12:57 AM

కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

విజయనగరం అర్బన్‌: డ్రైవింగ్‌ నేర్చుకున్న వారంతా సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలని అ లాగే రహదారి భద్రత కోసం అమలులో ఉన్న నియమాలను పాటించాలని కలెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌అంబేడ్కర్‌ సూచించారు. జీఎంఆర్‌ సంస్థ సీఎస్‌ఆర్‌ కింద భోగాపురం మండలం గూడెపువలస, ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెందిన యువతకు లైట్‌ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌లో నెల రోజుల పాటు 50 మంది యువకులకు శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణ పొందిన వారికి కలెక్టర్‌ చేతుల మీదుగా గురువారం ఆయన చాంబర్‌లో సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు, డీఆర్‌డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి, ఏఎల్‌డీఎం వైడీ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.

నిర్బంధించిన పశువులను కాపాడిన పోలీసులు

కొత్తవలస: మండలంలోని సంతపాలెం గ్రామం శివారు మామిడి తోటలో అక్రమంగా నిర్బంధించిన 171 పశువులను సీఐ సీహెచ్‌.షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కాపాడారు. ఆ పశువులను ఇక్కడికి తీసుకొచ్చి వధించి వేరే చోటకు మాంసాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయని అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పశువులను అక్రమంగా నిర్బంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆ పశువులను ప్రస్తుతానికి అక్కడే ఉంచామని కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.

చలో విజయవాడను విజయవంతం చేయండి

మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర

అధ్యక్షురాలు స్రవంతి

విజయనగరం గంటస్తంభం: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 19న విజయవాడలోని ధర్నా చౌక్‌ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్‌ మధ్యాహ్న భోజన పథకం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.స్రవంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆమె పట్టణంలోని పలు పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథక కార్మికులకు కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ కేవలం సేవా దృక్పథంతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఎన్ని ప్రభుత్వాలు మారినా నేటికీ అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఈనెల 19 జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా వ్యా ప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథక కార్మికులంతా హాజరవాలని కోరారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి కె.రాజి పాల్గొన్నారు

విజయీభవ

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్‌జూనియర్స్‌ బాల, బాలికల కబడ్డీ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు విజేతలుగా తిరిగి రావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కేవీ.ప్రభావతి ఆకాంక్షించారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరగనున్న అంతర్‌ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతి నిధ్యం వహించే క్రీడాకారులు గురువారం పయనమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జట్టులోకి అర్హత సాధించిన క్రీడాకారులకు ఆమె పలు సూచనలు చేశారు. కృషి, పట్టుదల, నిరంతర శిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా రా ణించగల సామర్థ్యం దక్కించుకోవచ్చని చెప్పా రు. విజయనగరం జిల్లా కబడ్డీ, ఖోఖో క్రీడల కు పెట్టింది పేరుగా ఖ్యాతినర్జించిందని, అదే తరహాలో సబ్‌జూనియర్స్‌ పోటీల్లో వర్ధమాన క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు.

సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి1
1/3

సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి

సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి2
2/3

సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి

సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి3
3/3

సురక్షితంగా డ్రైవింగ్‌ చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement