
మోసం చేయడంలో సక్సెస్
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ సకెస్స్ ఫుల్‌గా ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. విద్యార్థులకు రావాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు అర్హులైన నిరుద్యోగ యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లించాలి. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత పాలనకు గుణపాఠం తప్పదు.
– బెల్లాన
చంద్రశేఖర్,
మాజీ ఎంపీ, విజయనగరం
మోసపోయిన యువత
కూటమి నేతలు ఉత్తుత్తి హామీలతో యువతను మోసం చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చదువు కష్టాలు తెచ్చిపెట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదు.
– శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గం

మోసం చేయడంలో సక్సెస్