
తడి నేలల పరిరక్షణకు కృషి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలోని చెరుపులు, కాలువలు తదితర జలావాసాలు, తడి నేలల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. దీని కోసం ముందుగా చెరువులు తదితర జలవనరుల సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. జిల్లా తడి నేలల (వెబ్ ల్యాండ్స్) కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా జిల్లాలోని చెరువులు, కాలువలు తదితర తడి నేలలను సర్వే చేసి జాబితా తయారు చేయాలని సూచించారు.
పీఎంఏవై ఇళ్ల నిర్మాణానికి అదనపు సహాయం
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, అర్బన్, పీఎంజన్‌మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయం వల్ల జిల్లాలో 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్‌సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేల వంతున ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. 565 మంది షెడ్యూల్డ్ తెగల వారికి రూ.75 వేలు వంతున, 190 మంది ఆదిమతెగల వారికి పీఎంజన్‌మాన్ కింద ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో ఇంటికి రూ.లక్ష వంతున ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్