
నేత్రదానం చేసిన కనకరత్నం (ఫైల్)
చీపురుపల్లి: మనిషి మరణం శరీరానికే తప్ప నేత్రాలకు కాదని, మరణానంతరం నేత్రాలు మరొకరికి చూపునిస్తాయని నమ్మి..
తమ తల్లి నేత్రాలను కుమారులు దానం చేశారు. పట్టణంలోని డైలీ మార్కెట్‌కు చెందిన పట్నాన కనకరత్నం(78) గురువారం గుండెపోటుతో మరణించారు. తల్లి మరణించిందన్న దుఃఖాన్ని పక్కన పెట్టిన కుమారులు తవిటయ్య, శ్రీనివాసులు ఆమె నేత్రాలు దానం చేసి మరో ఇద్దరికి చూపు ప్రసాదించాలని నిర్ణయించారు. ఈ మేరకు పట్టణానికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బీవీ గోవిందరాజులు ను సంప్రదించారు. తక్షణమే స్పందించిన ఆ యన శ్రీకాకుళం రెడ్‌క్రాస్ సొసైటీకి సమాచా రం ఇవ్వగా అక్కడి నుంచి వచ్చిన టెక్నీషియ న్ సుజాత..వలంటీర్ల సహకారంతో మృతురాలు కనకరత్నం నేత్రాలు సేకరించారు.
44మద్యం సీసాలు సీజ్
● నిందితుడి అరెస్ట్
గజపతినగరం: మండలంలోని మరుపల్లి గ్రామంలో 44 మద్యం సీసాలు సీజ్ చేసి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ముందస్తు సమాచారం మేరకు గ్రామంలో మద్యం అమ్మకాలు చేస్తున్న దేవర రాము(43) షాపుపై దాడి చేసి 44 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.