
చీపురుపల్లి: అబద్ధపు హామీలు, డూప్లికేట్ మేనిఫెస్టోతో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వస్తున్నారని, ఆయన మాటలు నమ్మి మోసపోవద్దని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని పెదనడిపల్లిలో రైతుభరోసా కేంద్రాన్ని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో కలసి శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఆలోచించలేదన్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రానుండడంతో ప్రజలను మోసం చేసేందుకు తప్పుడు మేనిఫెస్టోలతో వస్తున్నాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 98.5 శాతం అమలు చేశారని గుర్తు చేశారు. 2014లో చంద్రబాబునాయుడు ఇచ్చిన 600 హామీల మేనిఫెస్టోను బయిటపెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి వెంకటనర్సమ్మ, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెవర ఉమ, పీఏసీఎస్ అధ్యక్షుడు పిసిని శ్రీను, సర్పంచ్ సూర పోలరాజ్, ఏఎంసీ చైర్మన్ దన్నాన జనార్దన్, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు ఇప్పిలి అనంతం, కరిమజ్జి శ్రీనివాసరావు, అధికార్ల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సమయంలోనే బాబుకు ప్రజలు గుర్తుకువస్తారు
అబద్ధపు హామీలు నమ్మి మోసపోవద్దు
జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్