
అధికారులతో మాట్లాడుతున్న వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్
చీపురుపల్లి: వారంతా బడుగు జీవులు. ఉపాధిహామీ పథకం పనులు చేస్తూ నాలుగు రూపాయలు కూడబెట్టుకుని జీవనం సాగిస్తున్నవారు. పెద్దగా చదుకున్న వారు కాదు.. పెద్దపెద్ద పట్టణాల్లో పుట్టిపెరిగిన వారూ కాదు... అయితేనేం అన్నింటికి మించిన సామాజిక స్పృహ వారిలో ఉంది. బతికున్నప్పుడే కాదు మరణానంతరం సమాజానికి ఉపయోగపడాలనే గొప్పమనస్సుతో దాదాపు 150 మంది ఉపాధిహామీ వేతనదారులు మరణానంతరం నేత్ర, అవయవదానం చేసేందుకు అంగీకారం తెలిపారు. మానవీయత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బి.వి.గోవిందరాజులు అవగాహన కల్పించడంతో పట్టణంలోని కొత్తఅగ్రహారం, జి.అగ్రహారానికి చెందిన వీరంతా అవయవదానానికి సంబంధించిన అంగీకార పత్రాలు అందజేశారు. అనంతరం అవయవ దానంపై ప్రతిజ్ఞ చేశారు.
● జిల్లా అధికారులకు వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్
నేత్ర, అవయవదానానికి 150 మంది
అంగీకారం