ఎయిడ్స్‌ బాధితులకు అండగా మేమంతా.. | - | Sakshi
Sakshi News home page

ఎయిడ్స్‌ బాధితులకు అండగా మేమంతా..

May 18 2026 9:49 AM | Updated on May 18 2026 9:49 AM

డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు

మహారాణిపేట: అంతర్జాతీయ ఎయిడ్స్‌ దీపస్మృత్యంజలి దినం సందర్భంగా ఆదివారం నగరంలో ర్యాలీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌తో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారి కుటుంబాలకు, వ్యాధితో పోరాడుతున్న వారికి మేమున్నాం అనే భరోసా కల్పించేందుకు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి సత్యం జంక్షన్‌ మీదుగా రామాటాకీస్‌ వరకు ఈ ర్యాలీ సాగింది. డీఎంహెచ్‌వో డాక్టర్‌ పి.జగదీశ్వరరావు ఈ ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు.

గత 20 ఏళ్లలో జిల్లాలో 7,445 మంది ఈ వ్యాధితో మరణించారని, ప్రస్తుతం 26,203 మంది బాధితులు ఏఆర్‌టీ మందులు వాడుతున్నారని తెలిపారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ నియంత్రణాధికారి డాక్టర్‌ రోణంకి రమేష్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పాజిటివ్‌ నెట్‌వర్క్‌ సభ్యులు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement