పగలే కాదు.. రాత్రి కూడా
2001 నుంచి వేడి తగ్గుదలలో 9 శాతం క్షీణత
● రాత్రి వేళల్లోనూ చల్లబడని విశాఖ
● వేసవి కాలంలో సగటు హీట్ ఇండెక్స్ 42 డిగ్రీలుగా నమోదు
● మే నెలాఖరు, జూన్ మొదటి వారంలో 50 డిగ్రీలకు చేరుకుంటున్న ఇండెక్స్
● అర్బన్ హీట్ ఐలాండ్‌గా మారుతున్న ప్రధాన నగర పరిధి
● సీఎస్‌ఈ నివేదికలో హెచ్చరికలు
ఒకప్పుడు పగటిపూట ఎండలు మండినా.. సాయంత్రం కాగానే సముద్రపు చల్లటి గాలులతో
హాయిగా సేదతీరిన విశాఖ.. ఇప్పుడు రాత్రి వేళల్లోనూ నిప్పుల కొలిమిలా మారుతోంది. ఆంధ్ర
విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్(సీఎస్‌ఈ), ట్రిపుల్ ఐటీ కొట్టాయం పరి
శోధకులు సంయుక్తంగా నిర్వహించిన తాజా శాసీ్త్రయ అధ్యయనం పలు ఆందోళనకరమైన
అంశాల్ని బహిర్గతం చేసింది. అంతర్జాతీయ జర్నల్ ‘డిస్కవర్ హజార్డ్స్’లో ప్రచురితమైన ఈ
నివేదిక.. గత మూడు దశాబ్దాల నాసా వాతావరణ సమాచారాన్ని క్షుణ్ణంగా విశ్లేషించింది.
రాబోయే రోజుల్లో విశాఖవాసులు ఉక్కపోత, అస్థిర వాతావరణ ముప్పును ఎదుర్కోనున్నారని
హెచ్చరించింది. విశాఖలో పగటి ఉష్ణోగ్రతల కంటే రాత్రి వేళల్లో వేడి తగ్గకపోవడమే అతిపెద్ద
సమస్యగా మారుతోందని ఈ అధ్యయనం వెల్లడించింది. –సాక్షి, విశాఖపట్నం
క్లైమెట్ హాట్‌స్పాట్స్
పరిశోధకులు 1990 నుంచి 2019 వరకు అంటే దాదాపు 3 దశాబ్దాల్లో విశాఖలోని ఉష్ణోగ్రతలు, వర్షపాతం, తేమ శాతానికి సంబంధించిన అధికారిక డేటాను సేకరించారు. అధునాతన సాంకేతికత కలిగిన సీజనల్ ఆటోరెగ్రెసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ ఏరియా(సరిమా), జీఐఎస్ మోడల్స్ ఆధారంగా వాతావరణ మార్పులను విశ్లేషించారు. దీని ప్రకారం 2019 నుంచి 2028 మధ్య కాలంలో విశాఖ వాతావరణంలో తీవ్రమైన అస్థిరత ఉంటుందని, పగలు–రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతాయని ఈ మోడలింగ్ అంచనా వేసినట్లు అధ్యయనంలో స్పష్టం చేశారు. చిన్నగా కావాలి
రాత్రి వేళల్లోనూ ఉక్కిరిబిక్కిరి
ఈ అధ్యయనం ప్రకారం, గతంలో వేసవి కాలంలో (మార్చి–మే) నగర సగటు ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల నుంచి 36 డిగ్రీల మధ్య నమోదయ్యేవి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఇప్పుడు 35.6 డిగ్రీల నుంచి 37 వరకూ పెరుగుతోంది. అంతకంటే ఆందోళనకరమైన అంశమేంటంటే.. రాత్రి వేళల్లోనూ సగటు ఉష్ణోగ్రతలు 27.1 డిగ్రీల నుంచి 28.1 డిగ్రీల కంటే తగ్గుముఖం పట్టడం లేదు. 2001–2010 కాలంతో పోలిస్తే, 2014–2023లో విశాఖలో రాత్రి వేళల్లో వేడి తగ్గడం 9 శాతం మేర క్షీణించింది. అంటే నగరం గతంలో కంటే తక్కువగా చల్లబడుతోంది. ముఖ్యంగా వేసవి కాలంలో (మార్చి–మే) రాత్రి ఉష్ణోగ్రతలు గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి.
పెరుగుతున్న క్‌లైమేట్ హాట్‌స్పాట్స్
నగర పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ వాతావరణం ఒకేలా లేదు. కాంక్రీట్ కట్టడాల వల్ల జనసాంద్రత, పారిశ్రామికీకరణ ఆధారంగా ఉష్ణోగ్రతల్లో తీవ్ర వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గాజువాక, స్టీల్‌ప్లాంట్ పరిసరాలు, ఎయిర్‌పోర్టు జోన్లను అత్యంత వేడిగా ఉండే ‘హాట్‌స్పాట్స్’గా పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పచ్చదనం క్షీణించడం, పారిశ్రామిక కార్యకలాపాలు, వాహనాల కాలుష్యం దీనికి ప్రధాన కారణాలు మారాయి. వీటికి భిన్నంగా గ్రామీణ స్వభావం కలిగిన పద్మనాభం వంటి ప్రాంతాలు ఇప్పటికీ కొంత చల్లగా ఉండటం గమనార్హం.


