రాత్రి 8.30 గంటల నుంచి రథోత్సవం
రాత్రి 10.30 గంటల నుంచి వార్షిక కల్యాణమహోత్సవం
15 వేల మంది భక్తులు వస్తారని అంచనా
జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర
నిధుల కొరతపై అధికారుల పెదవి విరుపు
జెడ్పీ సభలో వాడీవేడి చర్చ
నేరరహిత విశాఖే లక్ష్యం
సింహాచలం: చైత్ర శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై వేంచేసిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వార్షిక కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరగనుంది. దేవస్థానం ఈవో జె. వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు, వైదిక వర్గాలు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆలయ నీలాద్రి గుమ్మం వద్ద జరిగే కొట్నాల ఉత్సవంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ధ్వజారోహణం, 6.30 గంటలకు ఉత్సవమూర్తులతో ఎదురు సన్నాహోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8.30 గంటలకు మాడ వీధుల్లో రథోత్సవం, రాత్రి 10.30 గంటలకు ఉత్తర రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన సుందరమైన వేదికపై స్వామివారి వార్షిక కల్యాణాన్ని జరిపిస్తారు. ఈ వేడుకకు సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన అధికారులు, వారందరికీ అన్నప్రసాదం, పంపిణీకి తలంబ్రాలు, లడ్డూ ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం కొండపైన, దిగువన ఎల్‌ఈడీ స్క్రీన్లు, చలువ పందిళ్లు, తాగునీరు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో 15 షటిల్ సర్వీసులతో పాటు నగరం నలుమూలలకు ప్రత్యేక బస్సులు నడపనున్నారు. భద్రత కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కల్యాణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అప్పన్న మూలవిరాట్ దర్శనాలు లభిస్తాయి, తిరిగి రాత్రి 8.30 గంటల నుంచి 10.30 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. శనివారం ఉదయం రథ కదలికలను అధికారులు శాస్త్రోక్తంగా పరిశీలించి రథోత్సవానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సింహగిరిపై కల్యాణం ప్రాంగణంలో, మాడ వీధిలో, సింహగిరి బస్టాండ్, అన్నప్రసాద భవనం వద్ద, కొండదిగువ బస్టాండ్‌లో ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. ఫైర్ సేఫ్టీ సిలిండర్లు, అగ్నిమాపక శకటం అందుబాటులో ఉంచారు. దేవస్థానంలో రెగ్యులర్ సీసీ కెమెరాలతో పాటు కల్యాణోత్సవం ప్రాంగణం తదితర ప్రాంతాల్లో అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
ప్రజా సమస్యలపై సానుకూల దృక్పథం
అల్లిపురం: నగరంలో నేరాలు లేని వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా హోంగార్డు నుంచి ఉన్నతాధికారుల వరకు సమన్వయంతో పనిచేయాలని సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశించారు.నగర పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన మార్చి క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని, గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన పెంచాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్, రాత్రి నిఘా పటిష్టం చేయాలని ఆదేశిస్తూ.. విధుల్లో అవినీతికి పాల్పడినా, అధికార దుర్వినియోగం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీసీపీలు మణికంఠ చందోలు, మేరీ ప్రశాంతి, లతా మాధురి పాల్గొన్నారు.
మహారాణిపేట: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, నిర్ణీత సమయంలో నాణ్యమైన రీతిలో పరిష్కారం చూపించి ప్రజలకు భరోసా కల్పించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర పేర్కొన్నారు. శనివారం విశాఖ జెడ్పీ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పలు అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సేవలు పారదర్శకంగా అందేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో మౌలిక వసతులను మరింత విస్తరించాలని సూచించారు. ముఖ్యంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని విభాగాల్లో సమస్యలు అధికంగా ఉండి, నిధులు మాత్రం శూన్యంగా ఉన్నాయని అధికారులు సభలో వెల్లడించడం చర్చనీయాంశమైంది. సభ్యులు అడిగిన ప్రతి అభివృద్ధి పనికి ‘నిధుల కొరత’ అనే సమాధానమే వినిపించింది. చివరకు ఆర్‌అండ్‌బీ రోడ్ల గుంతలు పూడ్చేందుకు కూడా నిధుల్లేవని అధికారులు పేర్కొన్నారు. గిరిజన ప్రాంత వాసుల సౌకర్యార్థం మహాప్రస్థానం వాహనాల సేవలను విస్తరిస్తామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు విజయ కృష్ణన్, దినేష్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.
గిరిజనుల నుంచి విద్యుత్ బిల్లుల వసూళ్లు ఆపాలి
గిరిజనులకు ఉచిత వి ద్యుత్ సౌకర్యం ఉన్నప్పటికీ బిల్లులు ఇవ్వటం సరికాదని, ఆ ప్రక్రియను సరిదిద్దాల ని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. రోలుగుంట మడలం అర్ల పంచాయతీ పరిధిలోని కొత్తలోసింగి, లోసింగి, పెదగరువు, పీత్రిగెడ్డ, నీళ్లబంద గ్రామాల్లో గిరిజనులకు విద్యుత్ బిల్లులు ఇచ్చారంటూ ఆమె ప్రస్తావించారు. పునఃపరిశీలన చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు.


