మహారాణిపేట: జిల్లా నూతన రెవెన్యూ అధికారి(డీఆర్‌వో)గా ఎం.విశ్వేశ్వర నాయుడు శనివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇన్‌చార్జి డీఆర్వోగా వ్యవహరించిన శేష శైలజ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కాగా.. గతేడాది అక్టోబర్ 21న అప్పటి డీఆర్వో భవానీశంకర్, ఆర్డీవో శ్రీలేఖలను ప్రభుత్వం బదిలీ చేసినప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. మధ్యలో గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు అధికారి సత్తిబాబు ఇన్‌చార్జి డీఆర్వోగా పనిచేశారు. ఆయన విజయనగరం జిల్లాకు బదిలీ కావడంతో, కేఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్ శేష శైలజకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా విశ్వేశ్వర నాయుడు నియామకంతో జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి పూర్తిస్థాయి అధికారి లభించినట్లయింది.


