మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

మూలపేట పోర్టు పనులు సత్వరం పూర్తి చేయాలి

Mar 29 2026 6:47 AM | Updated on Mar 29 2026 6:47 AM

● నౌపడలో వైఎస్సార్‌ సీపీ భారీ బహిరంగ సభ రేపు ● పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు

సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నమైన మూలపేట పోర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం శ్రీకాకుళం జిల్లా నౌపడలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రూ. 4,361.91 కోట్లతో ప్రారంభించిన ఈ పోర్టు పనులు ఇప్పటికే 70 శాతం పూర్తయ్యాయని, అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. ఈ సభకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. సోమవారం ఉదయం 7.30 గంటలకు మద్దిలపాలెం పార్టీ కార్యాలయం నుంచి నాయకులు బయలుదేరతారని ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement